స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్ అవార్డును గెలుచుకున్న నగరమిదే..

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2020’ అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా

స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్ అవార్డును గెలుచుకున్న నగరమిదే..
Follow us

|

Updated on: Aug 20, 2020 | 4:31 PM

Indore’s Fourth Consecutive Win : కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2020’ అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది. అయితే తొలి ఎడిషన్‌లో మైసూర్ నగరం ఈ అవర్డును దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాది పోటీలో రాలేక పోయింది.

రెండో స్థానంలో గుజరాత్‌లోని సూర‌త్, మూడో స్థానంలో మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచాయి. అత్యుత్తమ గంగా నగరంగా వారణాసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా జ‌లంద‌ర్ కాంత్ దేశంలోనే అత్యంత ప‌రిశుభ్ర‌త క‌ల కంటోన్మెంట్‌గా ప్ర‌క‌టించారు. ఉత్తర్ ప్రదేశ్​లోని వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం ఖ్యాతి’ సాధించింది. మొద‌టి ప‌ది స్థానాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు ఉన్నాయి. గురువారం ‘స్వ‌చ్ఛ మ‌హోత్స‌వ్’ కార్య‌క్ర‌మంలో కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల మంత్రి హరదీప్ సింగ్ పూరీ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

4,242 న‌గ‌రాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా స‌మీపంలోని‌ ప‌ట్ట‌ణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన‌ స‌ర్వేలో పాల్గొన్నారు. ఈ స‌ర్వే 28 రోజుల పాటు చేప‌ట్ట‌గా అనంత‌రం ర్యాంకులు ప్ర‌క‌టించారు.