భారత్-చైనా ఐదో దఫా చర్చల్లో సరిహద్దుల సమస్య’ పరిష్కారమయ్యేనా ?

భారత్-చైనా మధ్య ఐదో దఫా చర్చలు ఆదివారం జరగనున్నాయి. లడాఖ్ ఫింగర్ ఏరియాలో చైనా పూర్తిగా త న దళాలను ఉపసంహరించాలని భారత సైన్యం కోరుతోంది. కమాండర్ల స్థాయిలో జరుగుతున్న ఈ చర్చల్లో..

భారత్-చైనా ఐదో దఫా చర్చల్లో సరిహద్దుల సమస్య' పరిష్కారమయ్యేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2020 | 10:50 AM

భారత్-చైనా మధ్య ఐదో దఫా చర్చలు ఆదివారం జరగనున్నాయి. లడాఖ్ ఫింగర్ ఏరియాలో చైనా పూర్తిగా త న దళాలను ఉపసంహరించాలని భారత సైన్యం కోరుతోంది. కమాండర్ల స్థాయిలో జరుగుతున్న ఈ చర్చల్లో ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి సారించనున్నారు. తూర్పు లడాఖ్ లో చైనా  డిస్ ఎంగేజ్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయలేదని ఇండియన్ ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డెఫ్ సాంగ్, గోగ్రా వంటి ప్రాంతాల్లో చైనా దళాలు ఇంకా మోహరించే ఉన్నాయి. భారత-చైనా మధ్య దౌత్య స్థాయిలో వర్చ్యువల్ గా జరిగిన చర్చలు అంతగా ఫలించలేదని సైనికవర్గాలు తెలిపాయి. సుమారు 40 వేల మంది  చైనా సైనికులు తమ మిలిటరీ ట్రక్కులు, ఇతర వాహనాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్నారని, తమ బంకుల నిర్మాణాలను తొలగించలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.

గాల్వన్ లోయలో పరిస్థితి ఇదివరకు కన్నా కొంత ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఏ క్షణంలో నైనా మళ్ళీ ఉద్రిక్తత తలెత్తవచ్చునని భావిస్తున్నారు. బఫర్ జోన్ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ గతంతో..మే నెల ముందు నాటితో  పోలిస్తే తిరిగి యధాతథ పరిస్థితి నెలకొంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.