బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్‌కి కరోనా పాజిటివ్

భారత్‌లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్‌కి కరోనా బారిన ప‌డ్డారు. రెండు వారాల క్రితం సిక్కిరెడ్డి వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా, తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయ‌ర్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి‌కి కూడా కరోనా సోకింది.

బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్‌కి కరోనా పాజిటివ్
Ram Naramaneni

|

Aug 28, 2020 | 9:50 AM

భారత్‌లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్‌కి కరోనా బారిన ప‌డ్డారు. రెండు వారాల క్రితం సిక్కిరెడ్డి వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా, తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయ‌ర్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి‌కి కూడా కరోనా సోకింది. దాంతో.. సాత్విక్ ప్రస్తుతం అమలాపురంలో హెమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. అర్జున అవార్డుకి ఎంపికైన 20 ఏళ్ల సాత్విక్ ఈ నెల 29న దాన్ని అందుకోవాల్సి ఉంది.

కరోనా వైరస్ సోకడంపై మీడియాతో సాత్విక్ స్పందించాడు. దురదృష్టవశాత్తు ఇది అంగీకరించాల్సిన నిజమ‌ని చెప్పాడు. కొద్దిరోజుల క్రితం చేయించుకున్న‌ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిపాడు. ఆ త‌ర్వాత ఆర్‌టీ- పీసీఆర్ టెస్టులోనూ కరోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు వివ‌రించాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాన‌ని, త‌న ఫ్రెండ్స్‌, అమ్మానాన్నలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని వివ‌రించాడు. అస‌లు త‌న‌కు వైర‌స్ ఎలా వ్యాప్తి చెందిందో తెలియ‌ట్లేద‌ని చెప్పాడు. కాగా సాత్విక్- చిరాగ్ శెట్టి డబుల్స్ జోడీ దేశం త‌రుపున ఆడుతూ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తోంది.

Also Read :

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu