సొంత తమ్ముడ్ని ఉరివేసి చంపిన అన్న

|

May 26, 2020 | 6:27 PM

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై.. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ అన్న‌.. అంబ‌ర్‌పేట చెన్నారెడ్డి న‌గ‌ర్ కి చెందిన మహ్మద్‌ మునావర్‌(32) అనే వ్య‌క్తి పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. దీంతో మునావర్‌ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో నిత్యం మద్యం […]

సొంత తమ్ముడ్ని ఉరివేసి చంపిన అన్న
Follow us on

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై.. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ అన్న‌..
అంబ‌ర్‌పేట చెన్నారెడ్డి న‌గ‌ర్ కి చెందిన మహ్మద్‌ మునావర్‌(32) అనే వ్య‌క్తి పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. దీంతో మునావర్‌ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో నిత్యం మద్యం సేవించి కుటుంబసభ్యులతో గొడవ పడేవాడు.
ఎప్ప‌టిలాగే మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న మునావర్.. అన్న‌ షాహిద్‌తో గొడవకు దిగాడు. సహనం కోల్పోయిన షాహిద్‌.. తమ్ముడు మునావర్‌కు ఉరేసి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షాహిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.