సీన్స్ రివ‌ర్స్..భార్య ఇంటి ముందు భ‌ర్త మౌన పోరాటం..

మోసం చేసిన భ‌ర్త‌ల ఇళ్ల ముందు భార్య‌లు పోరాటం చేయ‌డం ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అత్తింట్లో ర‌క్ష‌ణ కోసం, ఆస్థిలో వాటా కోసం, స‌మాన హ‌క్కుల కోసం భార్య‌లు భ‌ర్త‌ల ఇళ్ల ముందు ప్రొటెస్ట్ చేయ‌డం రోజూ ఎక్క‌డో ఓ చోట చూస్తూనే ఉంటాం.

సీన్స్ రివ‌ర్స్..భార్య ఇంటి ముందు భ‌ర్త మౌన పోరాటం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 6:08 PM

Variety Protest :మోసం చేసిన భ‌ర్త‌ల ఇళ్ల ముందు భార్య‌లు పోరాటం చేయ‌డం ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అత్తింట్లో ర‌క్ష‌ణ కోసం, ఆస్థిలో వాటా కోసం, స‌మాన హ‌క్కుల కోసం భార్య‌లు భ‌ర్త‌ల ఇళ్ల ముందు ప్రొటెస్ట్ చేయ‌డం రోజూ ఎక్క‌డో ఓ చోట చూస్తూనే ఉంటాం. కానీ భార్య ఇంటి ముందు భ‌ర్త పోరాటం చేయ‌డం మాత్రం చాలా రేర్ సీన్. నాణానికి రెండు వైపులు ఉంటాయ్. భ‌ర్త‌ల‌కు కూడా స‌మ‌స్య‌లు, బాధ‌లు ఉంటాయ్. తాజాగా భార్య ఇంటి ముందు భ‌ర్త మౌన పోరాటానికి దిగిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో చోటుచేసుకుంది. ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్య‌క్తి త‌న భార్య‌ను కాపురానికి పంపాలంటూ అత్తగారి ఇంటి ముందు మౌన‌పోరాటానికి దిగాడు.

వివరాల్లోకి వెళ్తే..2014 ఆగస్టు 23న పెద్దలను ఎదిరించి లేఖ శర్మ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి వైవాహిక జీవితం నిన్న మొన్న‌టివ‌ర‌కు అన్యోన్యంగా సాగింది. ఇటీవ‌ల ఇద్దరి మ‌ధ్య బేదాభిప్రాయాలు రావ‌డంతో లేఖ పుట్టింటికి వెళ్లింది. ఆమె అక్క‌డికి వెళ్లాక ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటికి వెళ్లిన కొన్ని రోజుల‌లోనే రాంకరన్‌తో తాను కాపురం చేయ‌లేన‌ని, తనకు విడాకులు కావాలంటూ లేఖ శర్మ కోర్టుకు వెళ్లింది. అయితే కరోనా కారణంగా కోర్టులు మూసివేయడంతో..కేసు విచార‌ణ మ‌రింత ఆల‌స్యం అవుతూ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు న్యాయం చేయాలంటూ అత్త‌గారింటి ముందు మౌన‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగాడు రాంకరన్‌.

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..