Hima Kohli : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్… ఎప్పుడో తెలుసా..?

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:50 am, Sun, 3 January 21
Hima Kohli : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్... ఎప్పుడో తెలుసా..?

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఈ నెల 7న ఉత్తరాఖండ్‌ సీజేగా ప్రమాణం చేస్తారు. మరోవైపు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఈనెల 6న ప్రమాణం చేయనున్నారు. అలాగే న్యాయమూర్తి జోయ్‌ మాల్యా బాగ్చీ ఈ నెల 4న ఉదయం 10:15 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు.