సచివాలయం భవనాల కూల్చివేత కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే..!

తెలంగాణ సచివాలయంలో ఉన్న భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన ఫైర్ సేఫ్టీ లేదని, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కూడా లేదని ప్రభుత్వం వాదించింది. ఇక్కడున్న భవనాల కూల్చివేతపై ఇప్పటికీ ఒక కమిటీ వేశామని తెలియజేస్తూ.. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. అదే విధంగా కొత్త సచివాలయం నిర్మాణం విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇదిలా ఉంటే రాష్ర్టం […]

సచివాలయం భవనాల  కూల్చివేత కేసులో హైకోర్టు ఏం  చెప్పిందంటే..!

తెలంగాణ సచివాలయంలో ఉన్న భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన ఫైర్ సేఫ్టీ లేదని, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కూడా లేదని ప్రభుత్వం వాదించింది. ఇక్కడున్న భవనాల కూల్చివేతపై ఇప్పటికీ ఒక కమిటీ వేశామని తెలియజేస్తూ.. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. అదే విధంగా కొత్త సచివాలయం నిర్మాణం విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇదిలా ఉంటే రాష్ర్టం రెండుగా విడిపోకముందు కొనసాగిన సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ప్రశ్నించారు. గత ఏడు సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలను సైతం కూల్చివేస్తున్నారని , ఈ విధంగా కూల్చివేయడం వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.