మీరు క్రిస్టోఫర్ నోలన్ నటించిన డార్క్ నైట్‌ని చూశారా? అందులో బాట్‌మాన్ కారు ఒక్క బటన్ నొక్కడంతో బైక్‌గా మారుతుంది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా దాని కొత్త ఉత్పత్తి సర్జ్ ఎస్32తో అలాంటి ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనం. ఈ వాహనం కేవలం మూడు నిమిషాల్లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్కూటర్‌గా మారుతుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం ప్రత్యేకమైన త్రీ-వీలర్ కమ్ స్కూటర్‌ను లాంచ్ చేశామని హీరో సర్జ్ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఒకే వాహనంలో ఎలక్ట్రిక్ రిక్షా, ఎలక్ట్రిక్ స్కూటర్ రెండింటి సౌలభ్యాన్ని అందించే ఈ స్కూటర్ వివరాలను ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఓ వీడియో ద్వారా ట్విట్టర్ ఎక్స్‌లోలో పంచుకున్నారు.
#Hero has unveiled a revolutionary three-wheeler that transforms into a two-wheeler, showcasing the innovative spirit and ingenuity of Indian engineering. It's amazing to witness such groundbreaking advancements. #Innovation #MakeInIndia 🇮🇳 🛵 pic.twitter.com/yHJPzys5kb
ఇవి కూడా చదవండి— Harsh Goenka (@hvgoenka) January 26, 2024
హీరో మోటోకార్ప్‌నకు సంబంధించిన సర్జ్ ఎస్ 32 స్వయం ఉపాధిపొందే వ్యక్తుల కోసం రూపొందించారు. సర్జ్ ఎస్32 అనేది టూ-ఇన్-వన్ కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ వెహికల్. వేరు చేయగలిగిన 2 వీలర్‌తో పెద్ద వాహనాల భావన నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించినట్లుగా ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌కు ఈ ఈవీ ఆటో కమ్ స్కూటర్ బాగా ఉపయోపడుతుందని పేర్కొంటున్నారు.
సర్జ్ ఎస్ 32 సంప్రదాయ 3 డబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్గో వెహికల్ లేదా రిక్షాను పోలి ఉంటుంది. ఇది విండ్‌స్క్రీన్, హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్లు, విండ్‌స్క్రీన్ వైపర్‌ల వంటి వాటితో ఫ్రంట్ ప్యాసింజర్ క్యాబిన్‌తో అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో తలుపులు లేనప్పటికీ వాతావరణ రక్షణ కోసం సర్జ్ తొలగించగలిగే జిప్పర్డ్ సాఫ్ట్ డోర్‌లను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక బటన్‌ను నొక్కితే ముందు విండ్‌షీల్డ్ విభాగం నిలువుగా పైకి లేచి లోపల ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బయటకు వస్తుంది. 3 డబ్లయూ వాహనానికి సంబంధించిన క్యాబిన్ స్ప్రింగ్-లోడెడ్ డబుల్-స్టాండ్ మెకానిజమ్ ద్వారా పని చేస్తుంది.
ఇక ఈవీ స్కూటర్ విషయానికి వస్తే ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, టర్న్ ఇండికేటర్‌లు, స్పీడో, స్విచ్‌గేర్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. సర్జ్ ఎస్ 32 బ్యాటరీ 3 డబ్ల్యూ మోటర్‌తో పని చేసినా స్కూటర్ మాత్రం 2 డబ్ల్యూ మోటర్‌తో పని చేస్తుంది. 3 డబ్ల్యూ ఈ- ఆటో శక్తివంతమైన 10 కేడబ్ల్యూ ఇంజిన్‌తో వస్తుంది. అయితే స్కూటర్ 3 కేడబ్లయూ ఇంజిన్‌తో వస్తుంది. ఈ – ఆటో గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇక స్కూటర్ విషయానికి వస్తే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ-ఆటో 500 కిలోల లోడ్ మోసే సామర్థ్యంతో వస్తుందని కంపెనీ పేర్కొంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి