ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, కెవిన్ పీటర్సన్.. ఇలా ఒకరేమిటి.. ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.. అంతేకాకుండా రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, మనీష్ పాండే వంటి సీనియర్, యువ ఇండియన్ ప్లేయర్స్‌ను కూడా మర్చిపోకూడదు. వీరందరూ కూడా ఐపీఎల్‌లో ఇప్పటివరకు ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ టీమ్.
ఐపీఎల్ స్టార్ట్ అయ్యి సుమారు 12 సంవత్సరాలు అవుతోంది. భారత్ ఆటగాళ్లు, విదేశీ ప్లేయర్స్‌తో కలిసి.. ఆర్సీబీ ఎంతో బలమైన టీమ్. కానీ ఒక్క ఏడాది కూడా కప్ గెలవలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే భారత్ టీమ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఈ టీమ్.. ఇన్నాళ్లు ట్రోఫీ గెలకపోవడం సగటు క్రికెట్ ప్రేమికుడిని నిరాశకు గురి చేస్తుంది.
ఆర్సీబీ పగ్గాలను విరాట్ కోహ్లీ చేపట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఈ టీమ్ ఇంతవరకు మొదటి టైటిల్ గెలవలేదు. ప్రతీ ఏడాది ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరుగుతున్నా.. ఆర్సీబీపై మాత్రం నమ్మకాన్ని వదల్లేదు. చిన్నస్వామి స్టేడియం.. రెడ్ ఫ్లాగ్స్‌తో.. ఆర్సీబీ.. నినాదాలతో హోరెత్తిపోతుంది.
ఇకపోతే 2020 సీజన్‌కు ఫ్రాంచైజీ.. టీమ్‌ను మరింత బలోపేతం చేయడానికి సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. క్రిస్ లిన్, డేవిడ్ మిల్లర్, రాబిన్ ఉతప్ప, మిచిల్ స్టార్క్, జయదేవ్ ఉనాద్కట్.. వంటి ఎందరో మేటి ఆటగాళ్లు ఆక్షన్‌లో ఉన్నారు. అంతేకాక బెంగుళూరు టీమ్‌లో 12 స్లాట్స్(6 విదేశీ) ఖాళీగా ఉన్నాయి. మరోవైపు అసలు ఇంతవరకు టీమ్ టైటిల్ గెలవకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బలమైన ఇండియన్ ప్లేయర్స్ లేకపోవడం…
దాదాపు 12 ఏళ్ళ ఐపీఎల్ సీజన్లను ఒకసారి పరిశీలిస్తే.. విజయవంతమైన ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్(4 టైటిల్స్).. చెన్నై సూపర్ కింగ్స్(3 టైటిల్స్)కు బలమైన ఇండియన్ లైనప్ ఉంది. చెన్నైను చూసుకుంటే.. ఎం.ఎస్.ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా వంటి వారు ఉన్నారు. ఇక ముంబైలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యలు టీమ్ విజయంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. కేవలం విరాట్ కోహ్లీ, చాహల్ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఐపీఎల్ అంటేనే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అంటే దాదాపు 65% మంది ఇండియన్ ప్లేయర్స్ టీమ్‌లో ఉంటారు. ఇక ఆర్సీబీకి మాత్రం విరాట్ కోహ్లీ ఒకే ఒక్కడు.
విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌పై పూర్తి భారం…
విరాట్ కోహ్లీ, డివిలియర్స్ చెలరేగిపోతే భారీ స్కోర్లు.. ఒకవేళ వాళ్లిద్దరూ పెవిలియన్ బాట పడితే.. ఆర్సీబీ తక్కువ స్కోర్ చేస్తుంది. ఇదే ఎప్పటినుంచో జరుగుతున్న సీన్. ఇప్పటికైనా మిగతా ప్లేయర్స్ చక్కటి ప్రదర్శన కనబరిస్తే.. టీమ్ అద్భుత విజయాలు అందుకోవడం ఈజీ.
ప్లేయర్స్‌ను కొనసాగించకపోవడం…
చెన్నై, ముంబై ఫ్రాంచైజీల గురించి మాట్లాడుకుంటే.. డుప్లెసిస్, బ్రావో, పొలార్డ్, లసిత్ మలింగా వంటి ప్లేయర్స్ గుర్తొస్తారు. వీరందరి మీద ఆయా జట్టు యాజమాన్యాలు నమ్మకం ఉంచి.. వారందరిని ప్రతీ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఆర్సీబీ మాత్రం డివిలియర్స్‌ను తప్ప మిగతా ఏ విదేశీ ప్లేయర్‌ను వరుస మ్యాచులు కొనసాగించిన దాఖలాలు లేవు.
ఇంకా గట్టిగా ఈ పాయింట్‌పైన డిస్కస్ చేయాలంటే.. ఎప్పుడైతే గేల్, వాట్సన్‌లను టీమ్ వదులుకుందో.. వారిద్దరూ గతేడాది.. 368, 490 పరుగులు చేశారు. అంతేకాకుండా షేన్ వాట్సన్ ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నైను ఒంటిచేత్తో గెలిపించే ప్రయత్నం కూడా చేశారు.
తప్పుడు నిర్ణయాలు…
రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్లందరూ కూడా ఒకప్పుడు ఈ ఫ్రాంచైజీకు చెందినవారే. వాళ్ళ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో.. యాజమాన్యం అందరిని టీమ్ నుంచి విడుదల చేసింది. ఇక ఏ ప్లేయర్స్‌ను అయితే యాజమాన్యం రిలీజ్ చేసిందో.. వారందరూ కూడా గతేడాది అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ఇకపోతే కేఎల్ రాహుల్.. 2020 సీజన్‌కు పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
ఇలా ఒకటేమిటి.. చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కూడా కొన్నిసార్లు సరైన డెషిషన్స్ తీసుకోకపోవడం కూడా ఆర్సీబీ ఫేట్‌ను మార్చడం జరుగుతోంది. ధోని లాంటి సమర్ధుడైన కెప్టెన్ దగ్గర సూచనలు తీసుకుంటూ.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటికైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుని ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.