Fixed Deposits: ఎఫ్డీలపై కొత్త వడ్డీ రేటు.. ఏకంగా 9.10శాతం.. మార్కెట్ ఇదే అత్యధికం..

నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి అందించడం మనకు లాభదాయకంగా ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఒకే విధమైన వడ్డీ అందించవు. కాబట్టి మనకు నమ్మకమైన, వడ్డీ ఎక్కువగా వచ్చే బ్యాంకులను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.

Fixed Deposits: ఎఫ్డీలపై కొత్త వడ్డీ రేటు.. ఏకంగా 9.10శాతం.. మార్కెట్ ఇదే అత్యధికం..
Fd Scheme
Follow us

|

Updated on: May 09, 2024 | 6:14 PM

ప్రజలందరికీ నమ్మకమైన, సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ముందు వరుసలో ఉంటాయి. వివిధ బ్యాంకులు, సంస్థలు అందించే వీటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి అందించడం మనకు లాభదాయకంగా ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఒకే విధమైన వడ్డీ అందించవు. కాబట్టి మనకు నమ్మకమైన, వడ్డీ ఎక్కువగా వచ్చే బ్యాంకులను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.

ఉత్కర్ష్ బ్యాంక్లో ఎఫ్డీ..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కు వడ్డీ రేట్లను సవరించింది. అవి మే ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన రేట్ల తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు ఇప్పటికే ఉన్న ఎఫ్ డీలకు వర్తిస్తాయి.

వడ్డీరేట్ల వివరాలు..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు సీనియర్ సిటిజన్లకు 4.6 శాతం నుంచి 9.10 శాతం వరకూ ఉన్నాయి. రెండు నుంచి మూడేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.10 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇక సాధారణ పౌరులకు ఏడు రోజుల నుంచి పదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.50 శాతం వరకూ, అలాగే రెండు నుంచి మూడేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే వాటిపై అత్యధికంగా 8.5 శాతం ఇస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఏడు నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4 శాతం, 46 నుంచి 90 రోజుల 4.75% వడ్డీ రేటును అమలు చేశారు.

అకాల ఉపసంహరణ..

ఎఫ్‌డీల అకాల ఉపసంహరణకు సంబంధించి నిబంధనలు ఇలా ఉన్నాయి. అలాంటి వాటిపై పెనాల్టీ 1 శాతం ( 7 రోజుల లోపు మూసివేతకు వర్తించదు) విధిస్తారు. అంటే డిపాజిట్ తేదీ నాటికి కార్డ్ రేటు కంటే 1 శాతం తక్కువ, డిపాజిట్ మిగిలి ఉన్న కాలానికి బ్యాంక్‌తో లేదా ఒప్పంద రేటు కంటే 1 శాతం తక్కువ, వీటిలో ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా చేయబడతాయి.

డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లు..

  • ఏడు నుంచి 45 రోజుల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.60 శాతం వడ్డీని ఇస్తున్నారు.
  • 46 నుంచి 90 రోజుల డిపాజిట్లపై 4.75 శాతం (సాధారణ), 5.35 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • 91 నుంచి 180 రోజులకు 5.50 శాతం (సాధారణ), 6.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • 181 నుంచి 364 రోజులకు 6.50 శాతం (సాధారణ), 7.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • 365 నుంచి 699 రోజులకు 8 శాతం (సాధారణ), 8.06 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • 700 నుంచి రెండేళ్ల లోపు 8.25 శాతం (సాధారణ), 8.85 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు 8.50 శాతం (సాధారణ), 9.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • మూడేళ్ల నుంచి నాలుగేళ్ల లోపు 8.25 శాతం (సాధారణ), 8.85 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు 7.75 శాతం (సాధారణ), 8.35 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • అయిదేళ్ల నుంచి పదేళ్ల డిపాజిట్లకు 7.25 శాతం (సాధారణ), 7.85 శాతం (సీనియర్ సిటిజన్లు).

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..