ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు విడుదల

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు విడుదల
Follow us

|

Updated on: Sep 12, 2020 | 4:40 PM

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటకు గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. కడప జిల్లా పులివెందులలో  మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటకు రూ.500 కోట్లు మంజూరయ్యయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్  కాలేజీకు రూ.550 కోట్లు కేటాయించింది ఏపీ సర్కార్.

పులివెందుల, పాడేరు, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కోచోట 100 ఎంబీబీఎస్ సీట్లు,  కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని మరియు పులివెందులలో కాలేజీల ఏర్పాటుకు రూ.104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు అనుమతులు మంజూరు అయ్యాయి.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

లేటెస్ట్ అప్డేట్ : మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం

Latest Articles