ఏపీలో పదోతరగతి విద్యార్థులకు శుభవార్త… ఆన్‌లైన్‌లోనే..

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. లాక్ డౌన్‌ని మే 3వ తేదీ వరకు పొడిగించినందున ప్రస్తుతానికి పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని ప్రకటించిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్..

ఏపీలో పదోతరగతి విద్యార్థులకు శుభవార్త... ఆన్‌లైన్‌లోనే..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 1:25 PM

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. లాక్ డౌన్‌ని మే 3వ తేదీ వరకు పొడిగించినందున ప్రస్తుతానికి పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని ప్రకటించిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్.. అప్పటి దాకా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తామని ప్రకటించారు. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పరీక్షలు జరిపేంత వరకు ఈ ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.

సప్తగిరి ఛానల్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారం అవుతాయని ఆయన వివరించారు. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. విద్యామృతం పేరుతో ఈ కార్యక్రమం రూపొందించామని, అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేశామని తెలిపారు.

‘‘ ఇప్పటికే ట్రయిల్ రన్ చేసాము… విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు… ఈ క్లాసులను వినియోగించుకోండి.. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు కూడా ముందుకు రావచ్చు’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ సందర్భంగా అన్నారు.