మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

|

Apr 30, 2020 | 7:49 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు మహర్దశ పట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక చోట ఫిషింగ్ హార్బర్‌ నిర్మించాలని నిర్ణయించింది. మొత్తంమీద తొమ్మిది చోట్ల చేపలవేటకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం గురువారం నాడు నిర్ణయించింది.

మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు మహర్దశ పట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక చోట ఫిషింగ్ హార్బర్‌ నిర్మించాలని నిర్ణయించింది. మొత్తంమీద తొమ్మిది చోట్ల చేపలవేటకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం గురువారం నాడు నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపినట్లు మంత్రి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఇక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, జెట్టీలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి మోపిదేవి తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. 1,100 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా బుడగలవారి పాలెంలో మేజర్ ఫిషింగ్ జెట్టి, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ప్రాంతాలలో జెట్టీలు నిర్మిస్తామని మంత్రి వివరించారు. వీటిలో ఒక్క బియ్యపుతిప్ప మినహా మిగిలిన అన్నింటికీ అనుమతులు గతంలోనే వచ్చాయని ఆయన చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా కోట్ల రూపాయల మేర ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు అవకాశాలు బాగా పెరిగిపోతాయని, వారు ఏ రాష్ట్రానికి వలస వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం రాదని మంత్రి వివరించారు.

మరోవైపు గుజరాత్ రాష్ట్రంలోని వేరావెల్‌లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి క్షేమంగా తరలిస్తున్నారని, శుక్రవారం సాయంత్రంలోగా వారంతా స్వస్థలాలకు చేరుకుంటారని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు