ఢిల్లీలో తుగ్లక్ పాలన.. కేజ్రీవాల్‌‌పై గంభీర్ విమర్శలు

దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో అక్కడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తంగా మారిపోయింది. దీంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీదే.. నిలిచిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

ఢిల్లీలో తుగ్లక్ పాలన.. కేజ్రీవాల్‌‌పై గంభీర్ విమర్శలు
Follow us

|

Updated on: Aug 13, 2020 | 7:35 PM

Gautam Gambhir Attacks Kejriwal : జోరుగా కురుస్తున్న వర్షాలు రాజకీయ రంగు పలుముకున్నాయి. దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో అక్కడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తంగా మారిపోయింది. దీంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీదే.. నిలిచిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద విమర్శల వర్షం కురిపించారు.

ఓ వీడియోను ట్వీట్‌ చేసిన గంభీర్‌.. ఢిల్లీ సీఎంని తుగ్లక్‌తో పోల్చారు. ఆ వీడియోలో 10-15 మంది ప్రయాణికులతో ఉన్న ఓ ఒంటెద్దు బండి వాననీటిలో రోడ్డులో ప్రయాణం చేస్తోంది. కొద్ది దూరం వెళ్లగానే బ్యాలెన్స్‌ తప్పి ప్రయాణికులు పడిపోయారు. కిందపడ్డవారిని వదిలేసి బండి వెళ్లి పోయింది. ఈ సంఘటనను ఉద్దేశించి గంభీర్‌.. ‘ఇది 14వ శతాబ్దంలో తుగ్లక్‌ పాలించిన ఢిల్లీ కాదు.. 21వ శతాబ్దపు తుగ్లక్‌ పాలన ఇది’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జకీరాలో ఓ బస్సు, ఆటో, కారు నీటిలో మునిగిపోయాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది.