రిషికేశ్‌ వంతెనపై నగ్న ఫొటోలు, వీడియోలు.. ఫ్రెంచ్ యువతి క్షమాపణ

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లోని పర్యాటక ప్రాంతం లక్ష్మణ్‌ ఝూలా( వ్రేలాడే వంతెన)ను ఇటీవల ఫ్రెంచ్ యువతి 27ఏళ్ల మేరీ హెలెన్ సందర్శించింది.

రిషికేశ్‌ వంతెనపై నగ్న ఫొటోలు, వీడియోలు.. ఫ్రెంచ్ యువతి క్షమాపణ
Anil kumar poka

|

Aug 31, 2020 | 2:00 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లోని పర్యాటక ప్రాంతం లక్ష్మణ్‌ ఝూలా( వ్రేలాడే వంతెన)ను ఇటీవల ఫ్రెంచ్ యువతి 27ఏళ్ల మేరీ హెలెన్ సందర్శించింది. ఆ బ్రిడ్జిపై ఆమె నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ విషయం గురించి స్థానిక నేత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఫ్రెంచ్ యువతిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను బెయిలుపై విడుదల చేశారు. అనంతరం ఆమె జరిగిన ఘటనపై భారతీయులకు క్షమాపణ చెప్పింది. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, చట్టాల మీద తనకు అంతగా అవగాహన లేదని. నా చర్యతో ఎవరి మనోభావాలైన గాయపరిచి ఉంటే నన్ను క్షమించండని అని ఫ్రెంచ్‌ యువతి అభ్యర్థించింది.

కాగా, పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం సదరు యువతి ఆన్‌లైన్‌లో బీడ్‌ నెక్లెస్‌ల బిజినెస్‌ చేస్తోందని.. తన వ్యాపారానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విధంగా వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హెలెన్‌ వాదన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. భారతదేశంలో లైంగిక వేధింపులపై అవగాహన కల్పించేందుకే ఈ తరహా ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇలాఉండగా, రిషికేశ్‌లో ఉన్న లక్ష్మణ్‌ ఝూలాకు చారిత్రక నేపథ్యం ఉంది. దాదాపు తొంభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనపై ప్రస్తుతం రాకపోకలు నిలిపివేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu