అమెరికా కెబినెట్‌లో స్వలింగ సంపర్కునికి స్థానం..కీలక నిర్ణయం తీసుకున్న జో బిడెన్

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ స్వలింగ సంపర్కునికి క్యాబినెట్‌లో స్థానం దక్కింది. కాబోయే అధ్యక్షుడు జో బిడెన్ రవాణా కార్యదర్శి పదవికి పీట్ బుట్టిగేగ్‌ను ఎంపిక చేశారు.

అమెరికా కెబినెట్‌లో స్వలింగ సంపర్కునికి స్థానం..కీలక నిర్ణయం తీసుకున్న జో బిడెన్
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:57 PM

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ స్వలింగ సంపర్కునికి క్యాబినెట్‌లో స్థానం దక్కింది. కాబోయే అధ్యక్షుడు జో బిడెన్ రవాణా కార్యదర్శి పదవికి పీట్ బుట్టిగేగ్‌ను ఎంపిక చేశారు. ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన పీట్ బుట్టిగెగ్‌ డెమోక్రాట్‌ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు బైడెన్‌తో పోటీ పడటం విశేషం.. చివర్లో బరి నుంచి తప్పుకొని బైఎడన్‌కు మద్దతు ప్రకటించారు. పీట్ బుట్టిగెగ్‌ గతంలో ఇండియానా స్టేట్‌లోని సౌత్‌బెండ్‌ నగరానికి మేయర్‌గా సేవలు అందించారు.

అమెరికా కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌ క్యాబినెట్‌ వైవిద్యానికి మారు పేరుగా నిలవనుంది. ఇండో అమెరికన్‌ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకోవడం ఒక వంతైతే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా నల్లజాతీయునికి రక్షణ కార్యదర్శి ఇస్తున్న రికార్డు లాయిడ్ ఆస్టిన్‌ రూపంలో దక్కించుకున్నారు.

తాజాగా మరో రికార్డు సృష్టించారు. స్వలింగ సంపర్కుడైన డెమోక్రాట్‌ సీనియర్‌ నేత పీట్ బుట్టిగెగ్‌ను రవాణా కార్యదర్శిగా నామినేట్ చేశారు. దీంతో అమెరికా చరిత్రలో ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నట్లయింది.  38 ఏళ్ల పీట్ బుట్టిగెగ్‌ గతంలో ఇండియానా స్టేట్‌లోని సౌత్‌బెండ్‌ నగరానికి మేయర్‌గా సేవలు అందించారు. డెమోక్రాట్‌ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు బైడెన్‌తో పోటీ పడినా, చివర్లో బరి నుంచి తప్పుకొని ఆయనకు మద్దతు ప్రకటించారు. తనను రవాకా కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తున్న బైడెన్‌కు బుట్టిగేగ్‌ ధన్యవాదాలు తెలిపారు.

తన క్యాబినెట్‌ అత్యుత్తమంగా ఉండబోతోందన్నారు జోబైడెన్‌. అన్ని వర్గాలను కలుపుకొని పని చేయబోతున్న చారిత్రాత్మిక క్యాబినెట్‌ ఇదేనని అన్నారు బైడెన్‌. తన క్యాబినెట్‌లో అనుభవం, సృజనాత్మకత, నైపుణ్యం, అర్హతలు ఉన్నవారికి చోటుకు కల్పిస్తున్నానని తెలిపారు బైడెన్‌. జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జోబైడెన్‌ ఇప్పటి వరకూ 9 మందిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.. మరి కొందరిని త్వరలో పరిచయం చేస్తానంటున్నారు బైడెన్‌.