వారి చివరి మొత్తాల చెల్లింపులు జరుపుతున్నాం..: ఆర్టీసీ

చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వారి కుటుంబాలకు చివరి మొత్తాలను చెల్లింపునకు ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్టీసీ సిబ్బంది ఈ ఏడాది జనవరి నుంచి ప్రజా రవాణా ఉద్యోగులుగా

వారి చివరి మొత్తాల చెల్లింపులు జరుపుతున్నాం..: ఆర్టీసీ
Follow us

|

Updated on: Oct 20, 2020 | 4:55 PM

చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వారి కుటుంబాలకు చివరి మొత్తాలను చెల్లింపునకు ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్టీసీ సిబ్బంది ఈ ఏడాది జనవరి నుంచి ప్రజా రవాణా ఉద్యోగులుగా మారిన విషయం తెలిసిందే. పీటీడీ ఉద్యోగులుగా మారినందున అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వీసులో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల చివరి మొత్తాల చెల్లింపులకు యాజమాన్యం అంగీకరిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల చివరి చెల్లింపులైన గ్రాట్యుటీ, ఆర్జిత లీవులు, చివరి నెల జీతాలను చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందించనున్నారు.

ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్‌ 30 వరకు సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల చివరి మొత్తాలు ఆడిట్‌ చేసి నవంబర్‌ ఐదో తేదీలోగా కేంద్ర కార్యాలయానికి రికార్డులు పంపాలని ఆదేశించింది. సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తమ ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల‌ వివరాలను సమీప బస్‌ డిపోలో అందించాలని అందులో పేర్కొన్నారు.