Bollywood Drugs: సుశాంత్ కేసు, ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత, సూత్రధారి రెగెల్ మహాకాల్ అరెస్ట్

సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బుధవారం ముంబైలో డ్రగ్స్ ను, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అంధేరీ వెస్ట్ ఏరియాలో రూ. 2.5 కోట్ల విలువైన 5 కిలోల హషిష్ ను, ఇతర మాదకద్రవ్యాలను..

  • Umakanth Rao
  • Publish Date - 3:09 pm, Wed, 9 December 20
Bollywood Drugs: సుశాంత్ కేసు, ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత, సూత్రధారి రెగెల్ మహాకాల్ అరెస్ట్

సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బుధవారం ముంబైలో డ్రగ్స్ ను, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అంధేరీ వెస్ట్ ఏరియాలో రూ. 2.5 కోట్ల విలువైన 5 కిలోల హషిష్ ను, ఇతర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈ సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఇతర ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసే రెగెల్ మహాకాల్ అనే సూత్రధారిని అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సంస్థ దాడులు నిర్వహించింది. మహాకాల్ కోసం చాలాకాలంగా  పోలీసులు గాలిస్తున్నారు. ఇతడిని రెండు రోజులపాటు వారు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ముఖ్యంగా సుశాంత్ కు, రియా చక్రవర్తికి, ఆమె సోదరుడు షోయబ్ కి మహాకాల్ డ్రగ్స్ సరఫరా చేసేవాడని వార్తలు వస్తున్నా వారితో ఇతని లింక్ గురించి తాము చెప్పలేమని ఎన్సీబీ అధికారులు అన్నారు. మరో నిందితుడైన అనుజ్ కేశ్వానికి, మహాకాల్ కు సంబంధాలు ఉన్నట్టు తెలిసిందన్నారు. అనుజ్ ను గత సెప్టెంబరులో అరెస్టు చేశారు. మహాకాల్ అరెస్టుతో మళ్ళీ బాలీవుడ్ కి, మాదకద్రవ్యాలకు మధ్య ఉన్న లింకులు సంచలనం కలిగించనున్నాయి.