లాక్​డౌన్ స‌మ‌యంలోనూ కరెంటు బిల్లులు కట్టాల్సిందే… లేదంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల చెల్లింపులకు కరోనా చిక్కొచ్చిపడింది. లాక్‌డౌన్‌తో ఇల్లు కదలని వినియోగదారులు బిల్లు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం నిర్ణీత సమయంలోగా కరెంట్‌ బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో అపరాధరుసుం మాఫీ అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యుత్‌ ఉద్యోగులు కూడా కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ కోసం రావడం లేదు. ఫిబ్రవరిలో జరిగిన విద్యుత్‌ వినియోగం ఆధారంగానే మార్చ్‌ బిల్లులు ఇచ్చారు. ఏప్రిల్‌ నెలలో కూడా ఇంతే అమౌంట్‌ను […]

లాక్​డౌన్ స‌మ‌యంలోనూ కరెంటు బిల్లులు కట్టాల్సిందే... లేదంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 4:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల చెల్లింపులకు కరోనా చిక్కొచ్చిపడింది. లాక్‌డౌన్‌తో ఇల్లు కదలని వినియోగదారులు బిల్లు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం నిర్ణీత సమయంలోగా కరెంట్‌ బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో అపరాధరుసుం మాఫీ అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యుత్‌ ఉద్యోగులు కూడా కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ కోసం రావడం లేదు. ఫిబ్రవరిలో జరిగిన విద్యుత్‌ వినియోగం ఆధారంగానే మార్చ్‌ బిల్లులు ఇచ్చారు. ఏప్రిల్‌ నెలలో కూడా ఇంతే అమౌంట్‌ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు అంటున్నారు. అది కూడా నిర్ణీత గడవులోగానే అని చెబుతున్నారు. మూడు నెల‌లపాటు క‌రెంట్ బిల్లులు క‌ట్ట‌క‌పోయినా ప‌ర్లేద‌ని కొంద‌రు అపోహ‌ప‌డుతున్నార‌ని..బిల్లులు చెల్లించ‌క‌పోతే పెనాల్టీలు వేయ‌డంతో పాటు క‌నెక్ట‌న్ తొల‌గిస్తామ‌ని విద్యుత్ శాఖ అధికారులు వెల్ల‌డించారు.