ఖాతా తెరవకుండానే వికెట్

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి తొలి ఓవర్‌లోనే పంజాబ్‌ స్పీడ్‌స్టర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ సంచలన బౌలింగ్‌తో షాక్‌ ఇచ్చాడు.

ఖాతా తెరవకుండానే వికెట్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 8:07 PM

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి తొలి ఓవర్‌లోనే పంజాబ్‌ స్పీడ్‌స్టర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ సంచలన బౌలింగ్‌తో షాక్‌ ఇచ్చాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన తొలి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ పరుగులు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. క్విటన్ డికాక్ ఐదో బాల్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు

పదునైన బంతులతో విరుచుకుపడుతున్న కాట్రెల్‌ తొలి ఓవర్‌లో వికెట్‌ తీయడంతో పాటు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. డికాక్‌ ఔటవడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మహ్మద్‌ షమీ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌ బాదిన హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గత మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లోనే 30 పరుగులు సమర్పించుకున్న కాట్రెల్‌కు ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్‌ అతణ్ని తొలి ఓవర్‌లోనే బరిలో దింపడం విశేషం.