ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నూత‌నంగా 15 రకాల వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు, వ్యాధి నిర్ధారణతో కలిపి మ‌రికొన్ని వైద్య ప‌రీక్ష‌ల‌ […]

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా
Follow us

|

Updated on: Apr 06, 2020 | 10:29 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నూత‌నంగా 15 రకాల వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు, వ్యాధి నిర్ధారణతో కలిపి మ‌రికొన్ని వైద్య ప‌రీక్ష‌ల‌ ప్యాకేజీల‌ను నిర్ణ‌యిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. కనిష్ఠంగా.. రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు కరోనా వైద్య ఖ‌ర్చుల‌ను భ‌రించ‌నుంది స‌ర్కార్. అయితే క‌రోనా బాధితుల‌ను గ‌వ‌ర్న‌మెంట్ అఫిషియ‌ల్స్ ప‌రిధిలో ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.