Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,949 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కి చేరింది. ఇందులో 26,622 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,81,509 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 18 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,643కు చేరుకుంది. ఇక నిన్న 3,609 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 192, చిత్తూరు 315, తూర్పుగోదావరి 417, గుంటూరు 421, కడప 193, కృష్ణా 457, కర్నూలు 32, నెల్లూరు 76, ప్రకాశం 99, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 114, విజయనగరం 67, పశ్చిమ గోదావరి 492 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,554కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 774 మంది కరోనాతో మరణించారు.
Also Read:
ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..
భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..
రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..
#COVIDUpdates: 28/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,11,879 పాజిటివ్ కేసు లకు గాను
*7,78,614 మంది డిశ్చార్జ్ కాగా
*6,643 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,622#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/MKdE2ECRyP— ArogyaAndhra (@ArogyaAndhra) October 28, 2020