6800 ఏళ్లకోసారి కనిపించే తోకచుక్క.. ఈనెల మొత్తం ఆకాశంలో ఇలా…

భూమివైపు తోకచుక్కలు దూసుకు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కొత్తగా కనిపెట్టిన తోకచుక్క ‘నియో వైజ్‌’ భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క ఆగస్టు రెండో వారం వరకు

6800 ఏళ్లకోసారి కనిపించే తోకచుక్క.. ఈనెల మొత్తం ఆకాశంలో ఇలా...
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:05 AM

భూమివైపు తోకచుక్కలు దూసుకు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కొత్తగా కనిపెట్టిన తోకచుక్క ‘నియో వైజ్‌’ భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క ఆగస్టు రెండో వారం వరకు భూమిపై నుంచి కనువిందు చేయనుంది. ఇది దాదాపు 5 కి.మీ. పొడవు ఉండనుందని, రాత్రి వేళల్లో కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి.

ఈ తోకచుక్క ఐదు కిలోమీటర్ల పొడువు ఉండటంతో, మనకళ్ళతో కూడా చూడొచ్చని అంటున్నారు. ఈ తోకచుక్క తన కక్ష్యలో పూర్తిగా ఓ రౌండ్ కొట్టడానికి 6,800 సంవత్సరాలు పడుతుందట. అమెరికాలోని టక్సన్ ప్రాంతంలో సూర్యోదయానికి కొన్ని క్షణాల ముందుగా కనిపించిన ఈ తోకచుక్క ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్ చేసింది. మార్చి నెల చివర్లో ఈ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పిన నాసా.. టక్సన్‌కు ఈశాన్యంగా ఇది కనిపించిందని తెలిపింది.

ఈ తోకచుక్క ఉత్తర అర్ధగోళంలో ఆగస్టు రెండో వారం వరకు కనిపిస్తుంది. కాలుష్యం లేని చీకటి ఆకాశంలో ఇది మనకళ్ళతో కనిపిస్తున్నప్పటికీ, పొడవైన తోకను చూడటానికి బైనాక్యులర్లు అవసరం.

[svt-event date=”12/07/2020,1:04AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Latest Articles