కృష్ణాజిల్లాలో ఘరానా మోసం, ఇంటి పన్ను పేరుతో ముంచేశారు

కాదేదీ కవితకు అనర్హం అని అప్పట్లో శ్రీశ్రీ గారు చెప్పారు. కాదేదీ మోసానికి అనర్హం అని ఇప్పటి కేటుగాళ్లు నిరూపిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో ఘరానా మోసం, ఇంటి పన్ను పేరుతో ముంచేశారు
Follow us

|

Updated on: Sep 11, 2020 | 6:57 PM

కాదేదీ కవితకు అనర్హం అని అప్పట్లో శ్రీశ్రీ గారు చెప్పారు. కాదేదీ మోసానికి అనర్హం అని ఇప్పటి కేటుగాళ్లు నిరూపిస్తున్నారు. ప్లేసు, సందర్భం, విషయం ఏదైనా సంబంధం లేకుండా దోచుకోడానికి మార్గాలు అన్వేశిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో ఓ కంత్రీ బ్యాచ్ కలకలం రేపింది. మైలవరం మండలం వెదురుబీడెంలో ఇంటి పన్ను పేరుతో  గుర్తు తెలియని వ్యక్తులు వసూళ్లకు తెగబడ్డారు. ఇంటి పన్ను, కుళాయి పన్ను పేరుతో గ్రామస్థుల నుంచి డబ్బు వసూలు చేశారు ఆగంతకులు. వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఓ వ్యక్తిని నిర్బంధించి, పోలీసులకు అప్పగించారు గ్రామస్థులు. నిందితులను అదుపులోకి తీసుకున్న మైలవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్