ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌కు ఊరట

 సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్ ఇప్పటికే సీబీఐని చాలాసార్లు కోరారు. సీఎంగా ఉన్నందున పాలన పట్ల దృష్టి సారించాలని, అంతేకాక తాను ప్రతివారం కోర్టుకు హాజరవ్వడం వల్ల.. […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:04 am, Mon, 25 November 19
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌కు ఊరట

 సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్ ఇప్పటికే సీబీఐని చాలాసార్లు కోరారు. సీఎంగా ఉన్నందున పాలన పట్ల దృష్టి సారించాలని, అంతేకాక తాను ప్రతివారం కోర్టుకు హాజరవ్వడం వల్ల.. ప్రభుత్వ సొమ్ము ఖర్చవుతుందని ఆయన బెయిల్ పిటీషన్‌లో పేర్కొన్నారు. కానీ సీఎం హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీబీఐ వాదనలతో కోర్టు గతంలో ఏకీభవించిన కోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. 

తాజాగా  ఈ కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్ హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరు కానవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. అక్రమ ఆస్తుల ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులో వైయస్ జగన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విషయంలో 16 నెలలు హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. వైయస్ జగన్ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైయస్ జగన్ ఇప్పటివరకు ప్రతి శుక్రవారం కోర్టులో హాజరవుతోన్న విషయం తెలిసిందే.