ఈ బుడతడు చేసిన పనికి.. కన్నీళ్లు వస్తాయి..!

తోడుబుట్టువు చూపించే ప్రేమ ఎవరితో సాటిరారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు ఓ బుడ్డోడు. అమ్మనాన్నల తర్వాత అంత ప్రేమ దొరకేదీ తోబుట్టవుల దగ్గరే. వీల్ ఛైర్ లో ఉన్న తన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు బాస్కెట్‌ ఆట ఆడించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్‌లో బాల్‌ వేసేందుకు ప్రయత్నించింది. కానీ […]

ఈ బుడతడు చేసిన పనికి.. కన్నీళ్లు వస్తాయి..!

తోడుబుట్టువు చూపించే ప్రేమ ఎవరితో సాటిరారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు ఓ బుడ్డోడు. అమ్మనాన్నల తర్వాత అంత ప్రేమ దొరకేదీ తోబుట్టవుల దగ్గరే. వీల్ ఛైర్ లో ఉన్న తన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు బాస్కెట్‌ ఆట ఆడించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్‌లో బాల్‌ వేసేందుకు ప్రయత్నించింది. కానీ తాన అనారోగ్యం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమవ్వడం వల్ల అది సాధ్యం కాలేదు. ఎదురుగా ఉన్న ఆమె సోదరుడు.. బాస్కెట్‌ను దగ్గరగా తీసుకువచ్చాడు. అతికష్టం మీద ఆ బాలిక అందులో బాల్‌ను వేయగా.. చప్పట్లు కొడుతూ ఆ బుడ్డోడు తన సోదరిని ఉత్సాహపరిచాడు.  14 సెకన్ల పాటు మాత్రమే ఉన్న వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించగా.. లైకులు, రీట్వీట్లతో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో సదరు పిల్లాడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి నీ లాంటి సోదరుడు ఉండాలంటూ ఆ చిన్నోడిని పొగిడేస్తున్నారు అంతా.