నువ్వు తోపు గురూ! 3 ప్రభుత్వ ఉద్యోగాలు… 30 ఏళ్ల పాటు…

నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన ఘనుల గురించి మనం విన్నాం… కానీ వాటన్నింటినీ తలదన్నే ఉదంతం బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..బీహార్ ఆర్థికశాఖ ఇటీవలే సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ నియామకాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లనూ తీసుకురావాలని కోరింది. సురేశ్ రామ్ అనే ఉద్యోగి మాత్రం కేవలం ఆధార్, పాన్ కార్డుల వివరాలతో తనిఖీలకు హాజరయ్యారు. అయితే అన్ని డాక్యుమెంట్లూ తీసుకురావాలని అతడిని అధికారులు ఆదేశించారు. అప్పటినుంచి […]

నువ్వు తోపు గురూ! 3 ప్రభుత్వ ఉద్యోగాలు... 30 ఏళ్ల పాటు...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2019 | 9:11 PM

నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన ఘనుల గురించి మనం విన్నాం… కానీ వాటన్నింటినీ తలదన్నే ఉదంతం బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..బీహార్ ఆర్థికశాఖ ఇటీవలే సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ నియామకాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లనూ తీసుకురావాలని కోరింది.

సురేశ్ రామ్ అనే ఉద్యోగి మాత్రం కేవలం ఆధార్, పాన్ కార్డుల వివరాలతో తనిఖీలకు హాజరయ్యారు. అయితే అన్ని డాక్యుమెంట్లూ తీసుకురావాలని అతడిని అధికారులు ఆదేశించారు. అప్పటినుంచి రామ్ విధులకు రావడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడి వివరాలను పరిశీలించారు. ఒకే పేరు, పుట్టిన తేదీతో, ఒకే వ్యక్తి మూడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి అవాక్కయ్యారు. 30 ఏళ్లుగా రామ్ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని తెలియడంతో షాకయ్యారు. రాష్ట్రానికి చెందిన భవన నిర్మాణ శాఖతో పాటు మరో రెండు శాఖల్లో అసిస్టెంట్ ఇంజీనీర్‌గా చెలామణీ అయిన రామ్..పదోన్నతి కూడా పొందాడని తెలిసి వారికి నోట మాట రాలేదు. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం అతడిని వెంటనే విధుల నుంచి తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.