AV Subba Reddy comments: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక మలుపు.. తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఏవీ సుబ్బారెడ్డి

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నారు సుబ్బారెడ్డి.

AV Subba Reddy comments: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక మలుపు.. తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఏవీ సుబ్బారెడ్డి
Follow us

|

Updated on: Jan 06, 2021 | 7:10 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో.. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. ఆయనను ఎ1గా చేర్చుతూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఏవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తనను ఎందుకు ఎ1 చేర్చారో తెలియదని తెలిపారు.

కాగా, ప్రవీణ్ రావు కుటుంబంతో తనకు ఉన్న సంబంధాలు వాస్తవమే.. అయినప్పటికీ కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. హఫీజ్ పేట్ భూమి వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేన్న సుబ్బారెడ్డి.. భూమా అఖిల ప్రియ నన్ను చంపడానికి సుపారి ఇచ్చిందని గతంలో కేసు పెట్టానని అన్నారు. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేస్తానని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఇదిలావుంటే, భూమా నాగిరెడ్డికి చెందిన ప‌లు బినామీ ఆస్తులు ఏవీ పేరిట ఉన్నట్లు ప్రచారంలో ఉంది. నంద్యాలలో నిప్పూ-ఉప్పులా పోట్లాడుకుంటోన్న ఏవీసుబ్బారెడ్డి-భూమా కుటుంబాలు హఫీజ్ పేట్ భూవ్యవహారంలో క‌లిసిపోయాయా? రెండు వర్గాలూ కలిసికట్టుగానే కిడ్నాప్‌కు స్కెచ్ వేశాయా? అన్నదీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

Latest Articles
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..