ఆసీస్‌ టెస్ట్‌ టీమ్‌లో విల్‌ పుకోవిస్కీకి చోటు

వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా కసరత్తులు మొదలుపెట్టింది.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ కోసం పకడ్బందీ జట్టును ఎంపిక చేసింది..

ఆసీస్‌ టెస్ట్‌ టీమ్‌లో విల్‌ పుకోవిస్కీకి చోటు
Follow us

|

Updated on: Nov 12, 2020 | 11:22 AM

వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా కసరత్తులు మొదలుపెట్టింది.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ కోసం పకడ్బందీ జట్టును ఎంపిక చేసింది.. బయోబబుల్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అదనంగా కొంతమందిని ఎంపిక చేసింది.. జట్టులో అనూహ్యంగా విల్‌ పుకోవిస్కీకి చోటు సంపాదించుకున్నాడు..ఈ యువ ఆటగాడు విక్టోరియా టీమ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.. పైగా షెఫీల్డ్‌ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లలో డబుల్‌ సెంచరీలు చేశాడు. డేవిడ్‌ వార్నర్‌తో ఇతను ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. వెస్టర్న్‌ ఆస్ట్రేలియా టీమ్‌ మెంబర్‌ కామరూన్‌ గ్రీన్‌ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.. ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టుకు టీమ్‌ పైన్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే! టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఆసీస్‌తో ఇండియా మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడుతుంది.. అన్నట్టు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కేవలం మొదటి టెస్ట్‌కు మాత్రమే సారథ్యం వహిస్తాడు.. ఆ తర్వాత అతను ఇండియాకు తిరిగి వస్తాడు..

ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌ టిమ్‌పైన్‌(కెప్టెన్‌), జేమ్స్‌ పాటిన్‌సన్‌, విల్‌ పుకోవిస్కి, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వీప్‌సన్‌, మాథ్యూవేడ్‌, డేవిడ్‌వార్నర్‌, సీన్‌ అబ్బాట్‌, జోబర్న్స్‌, పాట్‌ కమిన్స్‌, కామరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లయన్‌, మైఖేల్‌ నాసర్‌.

భారత్‌ టెస్టు టీమ్‌ విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, శుభ్‌మన్‌గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..