సస్పెన్షన్​పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు…

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది  సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. గతంలో అదనపు డిజి (సిఐడి) గా, డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) గా కూడా పనిచేశారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో […]

సస్పెన్షన్​పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు...
Follow us

|

Updated on: Feb 09, 2020 | 5:23 PM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది  సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. గతంలో అదనపు డిజి (సిఐడి) గా, డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) గా కూడా పనిచేశారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా విజయవాడను విడిచిపెట్టవద్దని ఆదేశించారు. రాష్ట్రానికి, దేశం భద్రతకు ముప్పుగా ఉన్న సంస్థతో  కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఐపిఎస్ అధికారి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది . ప్రధానంగా ఇజ్రాయెల్ కంపెనీ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్‌తో ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణ నడుపుతోన్న ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కాగా సస్పెన్షన్​పై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.  సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకి ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. తనపై, తన కుమారుడిపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.