గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

| Edited By:

Jun 24, 2019 | 9:30 AM

ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వాలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలో మొత్తం 1,70,543 వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెబ్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చిని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సూచించారు. అయితే నోటిఫికేషన్ […]

గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
Follow us on

ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వాలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలో మొత్తం 1,70,543 వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెబ్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చిని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సూచించారు. అయితే నోటిఫికేషన్ విడుదలైన ఒక్కరోజులోనే 1,47,376 మంది వెబ్ పోర్టల్‌ను సందర్శించినట్లు సమాచారం. gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జూన్ 24 నుంచి జూలై 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. తరువాత జూలై 10న అభ్యర్థుల జాబితాను పరిశీలన జరగనుంది. జూలై 11 నుంచి 25 వరకు అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆగస్టు 1న జాబితాను ప్రకటించనున్నారు. ఆగష్టు 5 నుంచి 10వ తేదీల మధ్య ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఆగష్టు 15 నాటికి పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.