జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

కరోనా కాలంలో జగన్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీ ఆరోగ్యశాఖలో భారీగా పోస్టులు భర్తీ చేసేందుకు సన్నద్దమవుతోంది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
Follow us

|

Updated on: Jun 18, 2020 | 1:02 AM

కరోనా కాలంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పెంపు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాలకు కూడా వర్తింపజేసేలా సాధారణ పరిపాలనాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 30 వరకు ఈ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలా ఉంటే ఏపీ ఆరోగ్యశాఖలో భారీగా పోస్టులు భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నియామకాల్లో కూడా జనరల్ అభ్యర్ధుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి మెమో జారీ చేశారు. ఇక 104 వాహనాల్లో, సీఎం ఆరోగ్య కేంద్రాల్లో 3 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నవారికి సివిల్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో 15 శాతం వెయిటేజీని ప్రభుత్వం ప్రకటించింది.

గిరిజన ప్రాంతాల్లో పనిచేసివారికి ఏడాదికి 3 మార్కులు, రూరల్ ప్రాంతాల్లోని వారికి 2, అర్బన్ ప్రాంతాల్లో పని చేసినవారికి ఒక్క మార్కు వెయిటేజీ ఇచ్చింది. అలాగే సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పీజీ పూర్తిచేసిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో 5 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. కాగా, ప్రజారోగ్యశాఖ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 665 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఖాళీలను ఎంబీబీఎస్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు.

Also Read: 

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

ఏపీ నిట్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. 25 మార్కులకే పరీక్ష!

30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..

Latest Articles
జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం
జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం
పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!
పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!
ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..
ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..