ఏపీ: పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఏపీ: పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ..
Follow us

|

Updated on: Sep 05, 2020 | 2:51 PM

Guidelines For Conduction Of Exams: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో ఈ నెల 30వ తేదీలోపు ఫైనలియర్, ఇతర సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ వివరించారు.

కరోనా నివారణా చర్యలు…

  • ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం, ఫేస్ కవర్లు లేదా మాస్కుల ధరించడం తప్పనిసరి.
  • తరుచుగా నీటితో లేదా శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూపేపర్‌ను అడ్డుపెట్టుకోవాలి. అంతేకాకుండా వాడిన టిష్యూపేపర్‌ను జాగ్రత్తగా చెత్తబుట్టలో పడేయాలి.
  • ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • బహిరంగంగా ఉమ్మి  వేయడం నిషేధం.
  • ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి.

పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష నిర్వహణకు అనుమతి లేదు. అంతేకాకుండా ఆయా జోన్లలో ఉన్న సిబ్బందిని, విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదు.
  • కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులకు స్పెషల్‌గా పరీక్ష నిర్వహించడం, లేదంటే వేరే మార్గాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలి.
  • పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది విద్యార్థులు గుమిగూడకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.
  • భౌతిక దూరం ఉండేలా సీటింగ్ అరెంజ్‌మెంట్స్ ఉండాలి.
  • పరీక్షా కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్​, హైపోక్లోరైట్​ సొల్యూషన్​ లాంటి వాటిని ఏర్పాటు చేయాలి.
  • విద్యార్థులు స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి.
  • కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ పోస్టర్లు, వీడియోలను పరీక్షా కేంద్రాల వద్ద ప్రదర్శించాలి.
  • కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించాలి.
  • విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్