కాసేపట్లో క్యాబినెట్ భేటీ : వీటిపైనే చర్చ..!

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. చట్టాల సవరణలపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. చట్ట సవరణలకు సంబంధించి పలు బిల్లులను చర్చించి ఆమోదం తెలపనున్నారు. మొత్తం 12 బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల పథకాలకు అనుగుణంగా కీలక చట్టాల్లో సవరణలు చేయనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్న బిల్లుల్లో లోకాయుక్త నియామకం కీలకంగా మారింది. తెలంగాణ […]

కాసేపట్లో క్యాబినెట్ భేటీ : వీటిపైనే చర్చ..!
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 7:45 AM

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. చట్టాల సవరణలపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. చట్ట సవరణలకు సంబంధించి పలు బిల్లులను చర్చించి ఆమోదం తెలపనున్నారు. మొత్తం 12 బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల పథకాలకు అనుగుణంగా కీలక చట్టాల్లో సవరణలు చేయనున్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్న బిల్లుల్లో లోకాయుక్త నియామకం కీలకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించుకునేలా చట్ట సవరణ చేయనున్నారు. ఇక జ్యుడీషియల్ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ 2001ను సవరిస్తూ బిల్లును తీసుకురానున్నారు.

కాగా.. ఇక స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే బిల్లుకూ, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పలు సంస్కరణలు తీసుకురానున్నారు. ఇలా 12 సవరణ బిల్లులను సభ ముందుకు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపనుంది.