పెట్రోల్ బంకుల్లో నయా దందా ‘చీటింగ్ చిప్స్’

ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్‌గా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేశారు. విజయవాడలోని ఏలూరు రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంకులో కొలతల్లో తేడాలను గుర్తించారు.

పెట్రోల్ బంకుల్లో నయా దందా 'చీటింగ్ చిప్స్'
Sanjay Kasula

|

Sep 04, 2020 | 9:20 PM

ఏపీ పెట్రోల్ బంకుల్లో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్‌గా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేశారు. విజయవాడలోని ఏలూరు రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంకులో కొలతల్లో తేడాలను గుర్తించారు. డిజిటల్ మీటర్లకు చిప్‌లు అమర్చి తక్కువ పెట్రోల్ కొడుతున్నట్లు తేల్చారు.

చిత్తూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లోను కొలతల్లో మోసాలు జరుగుతున్నాయి. టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులో తీసుకున్నారు పోలీసులు. బంక్ యాజమానులతో కుమ్మక్కై చిప్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వాహనదారులకు అనుమానం రాకుండా డిస్‌ప్లే లో మార్పు లేకుండా టెక్నాలజీ వాడుతున్నారు. ఏలూరుకు చెందిన భాష దీనికి సూత్రధారిగా గుర్తించారు. ఈ ముఠా తెలంగాణలో 17, ఏపీలో 24 పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి కొలతల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. ఇలాంటి చిప్‌ల ఏర్పాటుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారని పోలీసులు చెప్తున్నారు.

ప్రకాశం జిల్లాలోను పెట్రోల్‌ బంకుల్లో అధికారులు చెకింగ్స్‌ చేశారు. అక్కడా రీడింగ్‌లో తేడాలు వచ్చాయి. నాగులుప్పాడు మండలం అమ్మనబ్రోలులోని ఇండియన్ ఆయిల్‌ ఫిల్లింగ్ స్టేషన్‌లో ప్రత్యేక చిప్‌లు అమర్చి మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎంతకాలంగా జనాలను మోసం చేస్తున్నారని పెట్రోల్ బంక్ యజమానిని ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాలోని పలు పెట్రోల్‌ బంకులపైనా దాడులు జరిగాయి. కొలతల్లో తేడాలున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు కొరడా ఝులిపించారు. నాయుడుపేటలోని రెండు పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. వాటిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. చిప్‌లు సీజ్‌ చేశారు.

వాహనదారులకు తక్కువ పెట్రోల్‌ వచ్చేలా బంకుల్లో ఎలక్ట్రానిక్‌ చిప్‌లను అమర్చుతున్న ముఠా సభ్యులను ఇటీవల తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వాళ్లిచ్చిన సమాచారం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలో 7 పెట్రోల్‌ బంకుల్లో ఈ చిప్స్‌ను అమర్చినట్టు అధికారులు గుర్తించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu