AP Temple Politics: ఏపీలో ఆలయాల చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. ఒకవైపు విగ్రహాల ధ్వంసం కేసుల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు గతంలో టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనెల 8న దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
టీడీపీ హయాంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు అనేక ఆలయాలను కూల్చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిని ఇప్పుడు తిరిగి నిర్మిస్తామంటున్నారు. 13 జిల్లాల్లో ఇప్పటి వరకు కూల్చివేసిన 40 ఆలయాలను తిరిగి నిర్మిస్తామని తెలిపారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి. ఈనెల 8న ఉదయం 11 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రి జగన్ దుర్గ గుడి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 70 కోట్లతో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి రూపొందించిన నమూనాలు కూడా విడుదలయ్యాయి. విజయవాడలో సీతమ్మవారి పాదాలు ఆలయానికి సంబంధించిన నమూనా విడుదలైంది. పుష్కరాల సమయంలో విజయవాడలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, రాహు కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు దేవాలయాలను పునర్నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని 40 వరకు కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామంటున్నారు. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ సర్కార్ అనేక ఆలయాలను కూల్చివేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న ఆలయాలతో పాటు విజయవాడ నడిమధ్యలో ఉన్న గుళ్లను కూడా రోడ్డు వెడల్పు పేరుతో చంద్రబాబు కూల్చివేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read :Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్