వెకిలి చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన యాంకర్ అనసూయ

| Edited By:

Feb 10, 2020 | 2:28 PM

పాపులర్ యాంకర్, నటి అనసూయ పోలీసులను ఆశ్రయించింది. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చిల్లరిగాళ్ల వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీంతో ఇటీవలే సింగర్ కౌసల్య, సపోర్టింగ్ యాక్టర్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు చేస్తోన్న అసభ్యకరమైన కామెంట్స్‌, వెకిలి చేష్టలతో విసుగుపోయానని ట్విట్టర్ ద్వారా ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు […]

వెకిలి చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన యాంకర్ అనసూయ
Follow us on

పాపులర్ యాంకర్, నటి అనసూయ పోలీసులను ఆశ్రయించింది. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చిల్లరిగాళ్ల వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీంతో ఇటీవలే సింగర్ కౌసల్య, సపోర్టింగ్ యాక్టర్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు చేస్తోన్న అసభ్యకరమైన కామెంట్స్‌, వెకిలి చేష్టలతో విసుగుపోయానని ట్విట్టర్ ద్వారా ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌లో వారిని కోరింది. అలాగే.. శృతి మించుతూ చేస్తోన్న అసభ్యకరమైన కామెంట్స్‌ పట్ల స్పందించకపోతే.. ఇక తన సహనానికి అర్థం ఉండదని ఆమె ట్వీట్‌లో పేర్కొంది. ఈ వ్యాఖ్యల పట్ల తానేమీ సిగ్గుపడటం లేదని, సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది. అనసూయ ట్వీట్‌కు స్పందించిన సైబర్ క్రైమ్స్‌తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు కూడా స్పందించడం విశేషం.

కాగా.. యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై ట్విటర్‌లో కామెంట్ చేసింది ‘యాక్టర్స్ మసాలా’ అనే అకౌంట్ నుండి చేశారు. సైబర్ క్రైమ్స్‌కు ట్విట్టర్ ద్వారా అనసూయ, సాయి రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాము. అయినా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం ఉంటుంది. ఆ అకౌంట్ నుండి పలువురు హీరోయిన్స్, యాంకర్స్‌పై ఈ విధంగా పోస్టు వస్తున్నాయి. సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే.. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయని కెవీఎం ప్రసాద్ ( సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ) తెలిపారు.

తన ట్వీట్‌కి స్పందించిన పోలీసులు ఆమె ధన్యావాదాలు తెలిపింది. కాగా.. మరికొందరు నెటిజన్స్ కూడా అనసూయకు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.