రాష్ట్రపతిని కలిసిన రాజధాని రైతులు..కోవింద్ ఏమన్నారంటే?

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రాజకీయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరా తీశారు. ఢిల్లీ పర్యటనలో వున్న అమరావతి రాజధాని ప్రాంత రైతుల బ‌ృందం శుక్రవారం నాడు రాష్ట్రపతిని కలిసింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో అమరావతి రైతులతోపాటు జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ తదితరులున్నారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఈ బృందం మీడియాతో మాట్లాడింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసామని వారు తెలిపారు. రాష్ట్రంలో […]

రాష్ట్రపతిని కలిసిన రాజధాని రైతులు..కోవింద్ ఏమన్నారంటే?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 07, 2020 | 7:40 PM

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రాజకీయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరా తీశారు. ఢిల్లీ పర్యటనలో వున్న అమరావతి రాజధాని ప్రాంత రైతుల బ‌ృందం శుక్రవారం నాడు రాష్ట్రపతిని కలిసింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో అమరావతి రైతులతోపాటు జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ తదితరులున్నారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఈ బృందం మీడియాతో మాట్లాడింది.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసామని వారు తెలిపారు. రాష్ట్రంలో రైతులు చేస్తున్న నిరసనలు దీక్షల గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రైతుల మరణాలు చాలా దురదృష్టకరమని రాష్ట్రపతి అభిప్రాయపడినట్లు అమరావతి జెఏసీ ప్రతినిధులు తెలిపారు.

ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి విజ్ఞప్తి పత్రం అందజేసామని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశామని, వారిలో చాలా మంది జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

జగన్ ప్రభుత్వ ధోరణి వల్ల భవిష్యత్తులో ఎవరూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వంతో సహకరించేందుకు ముందుకు రారని ప్రతినిధిబృందం అభిప్రాయపడింది. భూములు ఇచ్చిన రైతుల్లో 30శాతం మంది దళితులు ఉన్నారని, ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని వారు కోరుతున్నారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.