కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ.. ఈనెల 20 తర్వాత ట్రయల్‌ రన్..!

కరోనా కాలంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. విజయవాడ నగరంలో నిర్మించిన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ రెడీ.. ఈనెల 20 తర్వాత ట్రయల్‌ రన్..!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 3:41 PM

కరోనా కాలంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. విజయవాడ నగరంలో నిర్మించిన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్‌ టెస్ట్‌’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.

అయితే.. ట్రయల్‌ రన్ కు ముందు ‘లోడ్‌ టెస్ట్‌’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్‌ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్‌ అండ్‌ బీ (క్వాలిటీ కంట్రోల్‌) సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ తెలిపారు.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ