ప్లేఆఫ్‌ బెర్తుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

SunRisers Qualify For Playoffs : ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (85 నాటౌట్‌ :58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (58 నాటౌట్:‌ 45 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది. […]

  • Sanjay Kasula
  • Publish Date - 12:15 am, Wed, 4 November 20
ప్లేఆఫ్‌ బెర్తుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

SunRisers Qualify For Playoffs : ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (85 నాటౌట్‌ :58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (58 నాటౌట్:‌ 45 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది.

అంతకుముందు పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ , జేసన్‌ హోల్డర్‌, షాబాజ్‌ నదీం దెబ్బకు ముంబై భారీ స్కోరును సాధించలేక పోయింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో కోల్‌కతా ప్లేఆఫ్‌ అవకాశాన్ని దక్కించుకుంది.