పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజు ఏదో ఒక చోట అమ్మాయిలపై లైంగిక, మానసిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక
Follow us

|

Updated on: Oct 10, 2020 | 5:03 PM

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజు ఏదో ఒక చోట అమ్మాయిలపై లైంగిక, మానసిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.  ఏం తెలియని వయసులోనే  అమ్మాయిలను  తల్లులను చేసి నెమ్మదిగా జారుకుంటున్నారు కీచకులు. తాజాగా 14 ఏళ్ల బాలిక పెళ్లి కాకుండానే తల్లి అయిన దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పేట్లబుర్జులోని గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రిలో 14ఏళ్ల బాలిక.. మూడున్నర కిలోల బరువు కలిగిన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివారాల్లోకి వెళ్తే.. బిహార్‌కు చెందిన ఓ కార్మికుడి కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. బేగంబజార్‌లోని నాగర్‌ఖానాలో అద్దె ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. అతనికి  14 ఏళ్ల కూతురు ఉంది. ఈనెల 6న బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెను గర్బవతిగా నిర్ధారించారు. అనంతరం ప్రసూతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అదేరోజు రాత్రి చిన్నారికి జన్మనిచ్చింది. శుక్రవారం ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు షాయినాయత్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను గర్భవతి చేసింది ఎవరన్నదానిపై పోలీసులు విచారణ జరపుతున్నారు.  ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )