కేరళలో ఆగని కరోనా కలకలం.. 24 గంటల్లో 3,757 పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 3,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 22 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,071కు చేరింది.

  • Sanjay Kasula
  • Publish Date - 8:33 pm, Mon, 23 November 20

Kerala Corona : గడిచిన 24 గంటల్లో 3,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 22 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,071కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,425 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 5,00,089కు చేరింది.

అయితే రికవరీ రేటు కూడా రోజు రోజుకు పెరగుతోంది. ఇక మరణాల రేటు తగ్గక పోవడం ఆందోళనకు గురి చేస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా  పాజిటివ్ కేసులు నాలుగు అంకెల సంఖ్య నుంచి దిగి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలను కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.