మెగాస్టార్ సరసన మహానటి..?

తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘సైరా’ పూర్తైన వెంటనే కొరటాల శివతో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సామాజిక కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుండగా.. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ వేటలో పడ్డాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే ఈ మూవీ కోసం నయనతార, తమన్నా, అనుష్క, శృతీ హాసన్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కీర్తి సురేశ్ చేరిపోయింది. ఈ మూవీలో నటించేందుకు దర్శకుడు […]

మెగాస్టార్ సరసన మహానటి..?
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 1:03 PM

తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘సైరా’ పూర్తైన వెంటనే కొరటాల శివతో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సామాజిక కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుండగా.. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ వేటలో పడ్డాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే ఈ మూవీ కోసం నయనతార, తమన్నా, అనుష్క, శృతీ హాసన్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కీర్తి సురేశ్ చేరిపోయింది.

ఈ మూవీలో నటించేందుకు దర్శకుడు కీర్తిని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ‘మహానటి’ తరువాత ఫుల్ బిజీ అయిపోయింది కీర్తి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది. మరి చిరంజీవి సరసన నటించేందుకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఒకవేళ ఇందులో నటించేందుకు కీర్తి ఒప్పుకుంటే.. తల్లి, కూతురితో నటించిన హీరోగా చిరు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. కీర్తి సురేశ్ తల్లి మేనకాతో చిరంజీవి ‘పున్నమి నాగు’లో నటించిన విషయం తెలిసిందే.