Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

అటు ఎడియూరప్ప విజయం.. ఇటు స్పీకర్ రాజీనామా

yediyurappa, అటు ఎడియూరప్ప విజయం.. ఇటు స్పీకర్ రాజీనామా

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం రెండు విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎడియూరప్ప సభలో విశ్వాస పరీక్షలో నెగ్గగా.. మూజువాణీ ఓటింగ్ పూర్తయిన వెంటనే స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేశారు. నిజానికి ఈయన రాజీనామాపై అదివరకే వార్తలు వచ్చాయి. మొత్తం 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని వీరు ప్రకటించారు. నేడు ఎడియూరప్ప బలపరీక్షలో నెగ్గగానే రమేష్ కుమార్ తన రాజీనామా లేఖను చదివి వినిపించారు. ‘ కొన్ని సందర్భాల్లో స్పీకర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని, ‘ మనం ‘ చాలా చిన్నవాళ్లమని ‘ అంతకుముందు అన్నారు. స్పీకర్ కూర్చున్న స్థానాన్ని అగౌరవపరచరాదని, నేతలు, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతుంటారని వ్యాఖ్యానించిన ఆయన.. ‘ బీ గుడ్..అండ్ డూ గుడ్ ‘ అని కూడా కాస్త వైరాగ్యపూర్వకంగా పేర్కొన్నారు.
కాగా-కర్ణాటక హై డ్రామా మొదట సుప్రీంకోర్టుకు చేరినప్పుడు.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని కోర్టు ప్రకటించినా.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరు కావాలా, వద్దా అన్న అంశం ఈ ఎమ్మెల్యేల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసిన సంగతి గమనార్హం. అంటే వారి స్వేచ్ఛకే అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా ప్రాధాన్యతనిచ్చింది. దీంతో తన విచక్షణాధికారానికి కోర్టు కత్తెర వేసినట్లుందని స్పీకర్ రమేష్ కుమార్ మనస్తాపం చెంది రాజీనామా చేసినట్టు కనబడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మాజీ సీఎం కుమారస్వామి ‘ మనిషి ‘ గా తనపై ముద్ర పడినట్లుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది.
ఇదిలాఉండగా .విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం ఎడియూరప్ప .. తాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోనని, ‘ మర్చిపోదాం, క్షమించేద్దాం ‘ అన్నదే తన సిధ్ధాంతమని వ్యాఖ్యానించారు. మరోవైపు. .. జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేసిన మాజీ సీఎం కుమారస్వామి..రెబెల్ ఎమ్మెల్యేల వల్లే ఇదంతా జరిగిందని విరుచుకపడ్డారు. చరిత్రలో ఈ ‘ ఘటనలు ‘ కనుమరుగు కావడం ఖాయమని, ఈ అసమ్మతి సభ్యులను వీధుల్లోకి లాక్కొచ్చి.వ్యవహారం నడిపించారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి దుయ్యబట్టారు. ఆ మధ్య వారిని స్పెషల్ ఫ్లయిట్ లో తీసుకువెళ్తే.. ఈ సారి నార్మల్ ప్లైట్ లో తీసుకువచ్చారు ‘ అని ఆయన ఎద్దేవా చేశారు.