చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను బండబూతులు తిట్టిన ఎమ్మెల్యే

ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పచ్చిబూతులు తిడుతూ తన పార్టీ శ్రేణులను, అనుచరులను ఉత్సాహంలో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై బండబూతులతో రెచ్చిపోయారు ద్వారంపూడి. వారు ముగ్గురిని బండబూతులతో తిట్టాలని వుంది అంటూనే ఆ బూతులన్నింటిని వాడేశారు. చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు ద్వారంపూడి చంద్రశేఖర్. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ వర్గాలను సమాయత్తం చేసే సందర్భంలో చంద్రశేఖర్ […]

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను బండబూతులు తిట్టిన ఎమ్మెల్యే
Follow us

|

Updated on: Jan 11, 2020 | 12:41 PM

ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పచ్చిబూతులు తిడుతూ తన పార్టీ శ్రేణులను, అనుచరులను ఉత్సాహంలో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై బండబూతులతో రెచ్చిపోయారు ద్వారంపూడి. వారు ముగ్గురిని బండబూతులతో తిట్టాలని వుంది అంటూనే ఆ బూతులన్నింటిని వాడేశారు.

చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు ద్వారంపూడి చంద్రశేఖర్. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ వర్గాలను సమాయత్తం చేసే సందర్భంలో చంద్రశేఖర్ బూతు ప్రయోగం చేసేశారు. చంద్రబాబుని లం# కొ##, వె## క# అని తిట్టాలని ఉంది అంటూ రాయడానికి వీళ్ళేని పదాలతో ఎమ్మెల్యే తిట్టిపోశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ది చెప్పాం… ఇక స్థానిక సంస్థల్లోను గట్టి దెబ్బ కొడితే ముసలోడు చంద్రబాబు ఇక లేవలేడంటూ సభ్యత లేని పదాలతో రెచ్చిపోయారు చంద్రశేఖర్.

గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియ జెప్పాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు కొడుకు పప్పు లోకేశ్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని ఆరోపిస్తూ.. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా ? అంటూ పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఒక దొం## కొ## అంటూ.. ఒక లం# చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు వైసీపీ ఎమ్మెల్యే. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలని, అమరావతిలో బినామీలను బయటకు తీయాలని చంద్రశేఖర్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలని డిమాండ్ చేశారాయన. చంద్రశేఖర్ ప్రయోగించిన పదాలపై వైపీపీ కార్యకర్తలు అప్పటికప్పుడు ఉత్సాహపడ్డా.. ఆ తర్వాత మరీ అంత తీవ్రమైన పదాల వినియోగం హుందాగా వుండదని వ్యాఖ్యానిస్తున్నారు.