దివిసీమలో జనసేనాని టూర్.. వరదలతో నష్టపోయిన రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి

దివిసీమలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో పవన్ ఈ సందర్భంగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు.

దివిసీమలో జనసేనాని టూర్.. వరదలతో నష్టపోయిన రైతులతో  పవన్ కళ్యాణ్ ముఖాముఖి
Follow us

|

Updated on: Dec 02, 2020 | 12:07 PM

దివిసీమలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో పవన్ ఈ సందర్భంగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని పాగోలులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే పెదప్రోలు బైపాస్ రోడ్డులో రైతులతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5తేదీల్లో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. గన్నవరం చేరుకున్న పవన్‌కి ఘనస్వాగతం లభించింది. అక్కడ నుంచి భారీ ర్యాలీగా బయలు దేరారు.. కాసేపట్లో కృష్ణా జిల్లాలో రైతులతో భేటీ కానున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు కొలకలూరుల్లో పవన్ పర్యటిస్తారు. 3వ తేదీన తిరుపతి చేరుకుని చిత్తూరుజిల్లాలో పర్యటిస్తారు. 4వతేదీన శ్రీకాళహస్తిలో పవన్ పర్యటన ఉంటుందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

నివార్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని… రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.