బ్రేకింగ్: జేసీ దివాకర్‌కు దిమ్మతిరిగే షాక్

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఒకవైపు పోలీసు కేసులు మరోవైపు ట్రావెల్స్ బస్సుల సీజ్ కొనసాగుతుండగానే జేసీపై మరో పిడుగు పడింది. ఆయనకు జగన్ ప్రభుత్వం ఈసారి గట్టి దెబ్బ కొట్టింది. జెసి సోదరులకు చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికిలోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి గతంలో ఇచ్చిన లీజులను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. యాడికిలోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు […]

బ్రేకింగ్: జేసీ దివాకర్‌కు దిమ్మతిరిగే షాక్
Follow us

|

Updated on: Jan 31, 2020 | 6:10 PM

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఒకవైపు పోలీసు కేసులు మరోవైపు ట్రావెల్స్ బస్సుల సీజ్ కొనసాగుతుండగానే జేసీపై మరో పిడుగు పడింది. ఆయనకు జగన్ ప్రభుత్వం ఈసారి గట్టి దెబ్బ కొట్టింది.

జెసి సోదరులకు చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికిలోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి గతంలో ఇచ్చిన లీజులను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. యాడికిలోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణం గడువును ఐదేళ్ళు పొడిగిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు.

లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిమెంట్ ప్లాంట్ నిర్మిస్తామంటూ మైనింగ్ లైసెన్సులు పొంది, ఖనిజాన్ని వేరే వారికి విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలను జేసీ దివాకర్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ఆయనకు పెద్ద షాక్ గానే భావించాలి.