Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

దగ్గుబాటికి తాజా సెగ.. అటో ఇటో తేల్చుకోవాలని అల్టిమేటమ్ !

daggubati family under tension, దగ్గుబాటికి తాజా సెగ.. అటో ఇటో తేల్చుకోవాలని అల్టిమేటమ్ !

సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీలో సెగ మొదలైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి సెగకు డెడ్ లైన్ కూడా తోడవడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుకోకుండా వైసీపీలో చేరి పరుచూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పాలైనప్పటికీ పార్టీలో ఎంతో కొంత పలుకుబడి మెయింటేన్ చేసిన దగ్గుబాటికి ఇటీవల సొంత నియోజకవర్గం నుంచే సెగ మొదలైంది.

పోలీసు అధికారులతో పాటు ఇతర నియోజకవర్గ స్థాయి అధికారులు ఆయన సిఫార్సుతోనే పోస్టింగ్‌లు పొందారు. దాంతో ఆయన గెలవకపోయినా అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని అనుకున్నారు. అయితే హఠాత్తుగా సీన్ మారిపోయింది. దగ్గుబాటికి తెలియకుండానే పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు రామనాథంబాబును తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.

నియోజకవర్గానికి సంబంధించి రామనాథంబాబు మాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు, పార్టీ నేతలకు సందేశం వెళ్లిపోయింది. రావి రామనాథంబాబు ఎన్నికలకు ముందు పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్. దగ్గుబాటి వైసీపీలో చేరడంతో రామనాథంబాబుకు ఆ పార్టీలో ఆదరణ దక్కలేదు. దాంతో ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ఆయన కృషి చేశారు. కానీ హఠాత్తుగా ఆయనను పిలిచి మరీ వైసీపీలో చేర్చుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయనే స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అప్పటి నుంచి దగ్గుబాటికి పర్చూరులో ప్రాధాన్యత లేకుండా పోయింది. మాట మాత్రమైన తనకు చెప్పకుండా రామనాథంబాబును పార్టీలోకి చేర్చుకోవడం.. తనకు ప్రధాన్యత తగ్గించడంతో దగ్గుబాటి అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆయన జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డిని అయినా కలుసుకుని ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకుంటే దానికి కూడా అవకాశం ఇవ్వనట్లు సమాచారం.

అయితే జగన్‌తో భేటీ కావాలంటే ముందుగా ఓ అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ దగ్గుబాటికి సమాచారం పంపినట్లుగా తాజాగా ప్రచారం మొదలైంది. బిజెపిలో వున్న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. దంపతులిద్దరూ చెరోపార్టీలో ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయని, పురంధేశ్వరి కూడా వైసీపీలోకి వస్తే ప్రాధాన్యమిస్తామని, లేకపోతే ఎవరూ పార్టీకి అవసరం లేదన్నట్లుగా సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు కూడా పురంధేశ్వరి బిజెపిలోనే వున్నారు. ఆమె అక్కడ వుండగానే దగ్గుబాటిని వైసీపీలో చేర్చుకున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని దగ్గబాటి కుటుంబంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆమె బీజేపీని వీడే అవకాశమే లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దానికి తోడు పార్టీ కోసం కష్టపడే నేతగా బీజేపీలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఏపీ నుంచి జాతీయ స్థాయిలో ఏ పదవులనైనా భర్తీ చేయాలనుకుంటే బీజేపీ నేతలు పురంధేశ్వరి పేరును కూడా ప్రముఖంగా పరిశీలిస్తారు. అలాంటి పార్టీని వీడి వైసీపీలో చేరే అవకాశమే లేదని చెబుతున్నారు. తాజా అల్టిమేటమ్ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.