Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

సినిమాలకు మహేష్ బ్రేక్.. అసలు కారణమిదేనా..!

Mahesh Babu taking 3 months break, సినిమాలకు మహేష్ బ్రేక్.. అసలు కారణమిదేనా..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత దాదాపు మూడు నెలలు ఆయన లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు మహేష్ భార్య నమ్రత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన మహేష్ కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాడని.. అందుకే ఈ సారి ల్యాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నాడని ఆమె పేర్కొంది. అయితే ఈ గ్యాప్ వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

తన లుక్‌ను మార్చుకోవడం కోసమే మహేష్ బాబు ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు హీరోగా 26 చిత్రాల్లో నటించిన(సరిలేరు నీకెవ్వరుతో కలిపి) మహేష్ బాబు.. లుక్‌ పరంగా కొత్తగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దీనిపై అప్పుడప్పుడు విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈసారి వాటన్నింటికి చెక్ పెట్టాలనుకుంటోన్న మహేష్.. ఈ గ్యాప్‌లో కొత్తగా తయారుకానున్నట్లు టాక్. కాగా మహేష్ బాబు తదుపరి చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్ నటిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం వంగా, బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌, మహేష్‌తో పాన్ ఇండియా మూవీని తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పుకార్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్, ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల అవ్వనుండగా.. ఆ వెంటనే మహేష్‌తో సెట్స్ మీదకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారట. ఈ లోపు మహేష్, కొత్త లుక్‌లో రెడీ అయ్యి సిద్ధంగా ఉండనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత..?  మహేష్ నెక్ట్స్ సినిమా ఏంటి..? మహేష్ ఎలా మేకోవర్ కానున్నాడు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే ‘సరిలేరు నీకెవ్వరు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.