‘మన్మధుడు 2’కు కాపీ మరక..?

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక అటు సినీ ప్రముఖులు సైతం టీజర్ చూసి.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ చూసిన  కొందరు సినిమాపై కాపీ మరకను వేశారు. ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ ప్రెటీ మోయిటా మెయిన్ ( […]

'మన్మధుడు 2'కు కాపీ మరక..?
Follow us

|

Updated on: Jun 15, 2019 | 10:00 AM

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక అటు సినీ ప్రముఖులు సైతం టీజర్ చూసి.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ చూసిన  కొందరు సినిమాపై కాపీ మరకను వేశారు.

ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ ప్రెటీ మోయిటా మెయిన్ ( ప్రపంచవ్యాప్తంగా ఐ డూ పేరుతో విడుద‌లైంది) సినిమా టీజర్ మాదిరిగానే ‘మన్మధుడు 2’ టీజర్ ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఫ్రెంచ్ చిత్రంలోనూ మధ్య వ‌య‌స్కుడైన వ్య‌క్తి త‌న అక్క‌ల‌ను, త‌ల్లిని పెళ్లి చేయ‌మ‌ని వేధిస్తుంటాడు. సరిగ్గా అలాంటి కథాంశంతోనే ‘మ‌న్మ‌థుడు 2’ తెరకెక్కుతోందని నెటిజన్ల భావన. టీజర్ రిలీజైన రెండు రోజుల్లోనే ఇలాంటి వార్తలు రావడంపై దర్శకుడు ఏమని స్పందిస్తాడో వేచి చూడాలి.

మరోవైపు ఈ చిత్రంలో సమంతా, కీర్తి సురేష్, కన్నడ బ్యూటీ అక్షర గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.